గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Shiva |
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, కొండపాక: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పుష్ప రాజ్ తెలిసిన వివరాలు ప్రకారం.. కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన గంగిశెట్టి పెంటయ్య(65) శనివారం టిఫిన్ చేసేందుకు రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుంచి వస్తున్నటువంటి గర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు బలమైన గాయం తగలడం తో అక్కడిక్కడి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేస్తున్నమని తెలిపారు

Advertisement

Next Story

Most Viewed