ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

by Shiva |   ( Updated:2023-05-09 10:51:47.0  )
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు
X

దిశ, పెగడపల్లి : ఇంటర్ ఫలితాల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ సుంకరి రవి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్.ప్రశాంత్ 450 మార్కులు, కే.త్రిష 442 మార్కులు, సీఈసీ విభాగంలో జే.అభిషేక్ 442 మార్కులు సాధించారు.

అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో వి.నిరోషా 970, ఈ.సమన్విత 962 మార్కులు, బైపీసీ విభాగంలో కే.నవ్య 952 మార్కులు, సీఈసీ విభాగంలో యు.పవిత్ర 940, బి.రఘు 930 మార్కులు సాధించి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధించామని ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రవి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story