- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

X
దిశ, చేగుంట: చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నార్సింగి మండల పరిధిలోని షేర్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షేర్ పల్లి గ్రామానికి చెందిన చెప్యాల గంగారాం (54) మంగళవారం స్థానికంగా ఉండే గుండు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చీకటి పడినా గంగారాం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. బుధవారం మధ్యాహ్నం గుండు చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలుతోందన్న సమాచారం పోలీసులకు రావడంతో వారు చెరువు వద్దకు మృతదేహాన్ని బయటకు తీయించారు. ఆ మృతదేహం గంగారాంది గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story