Siddipet : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రేమతో.. మద్యం ప్రియుల పేరిట ఓ లేఖ

by Aamani |   ( Updated:2024-10-29 11:37:22.0  )
Siddipet : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రేమతో.. మద్యం ప్రియుల పేరిట ఓ లేఖ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మంత్రి పొన్నం ప్రభాకర్ కు( Minister Ponnam ప్రభాకర్ )మద్యం ప్రియుల పేరిట రాసిన ఓ లేఖ వైరల్ గా మారింది. లేఖలో.. ‘గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా ... నేను,నా స్నేహితులు ప్రతి వారం అనగా నెలలో ప్రతి ఆదివారం మద్యం సేవిస్తాం. అయితే ఈ ప్రస్తావన మీ దగ్గరకు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్నేహితులం కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తుంది. పక్కా అనుమతి తీసుకోవాలని మీరు సూచించడం మాకు ఆందోళన కలిగిస్తుంది. కావున మా యందు మీరు దయ తలచి ఎక్కడ అనుమతి తీసుకోవాలి ముఖ్య మంత్రి దగ్గరా..? లేదా మీ వద్దనా..? లేదా ఎక్సైజ్ శాఖ వద్ద నా..? ఒక క్లారిటీ ఇస్తే మేము మా స్నేహితులు అందరం అనుమతి తీసుకొని పార్టీ చేసుకుంటామని కోరుతున్నాం. ఇట్లు తెలంగాణ వాసి’ అని ఉంది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖను చదివిన పలువురు ఫన్నీ కామెంట్స్( Funny comments ) చేస్తుండటంతో మద్యం ప్రియుల లేఖ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed