fire accident: అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం

by Mahesh |
fire accident: అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, తూప్రాన్: అర్ధరాత్రి కార్ షెడ్‌లో మంటలు చెలరేగి 9 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద గల లిమ్రా మోటార్స్ కారు మెకానిక్ షెడ్‌లో చోటు చేసుకుంది. షాప్ యజమాని తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కార్ షెడ్‌ యజమాని సోయల్ రాత్రి షెడ్ మూసివేసి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అతనికి సమాచారం అందించారు. అతను హుటాహుటిన షాప్ వద్దకు వచ్చే సమయానికి మంటలు భారీగా చెలరేగడంతో మెకానిక్ షెడ్‌లో ఉన్న 9 వాహనాలు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed