- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెంగీతో ఐదేళ్ల బాలుడు మృతి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతి చెందిన బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో నివాసం ఉంటున్న రాజు రజిత ల కుమారుడు అయాన్ష్ కు జ్వరం రావడంతో ఈనెల 19న పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా మందులు రాసి ఇంటికి పంపించారు.
జ్వరం తగ్గక పోవడంతో ఈనెల 22 వ తేదీన మరోసారి ఆసుపత్రికి తీసుకురాగా రక్త పరీక్షలు నిర్వహించి డెంగీ గా నిర్ధారించగా ఆసుపత్రిలో చేరాలని వైద్యుల సూచన మేరకు బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి డాక్టర్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కాగా వైద్యుల నిర్లక్ష్య కారణంగా బాలుడు మృతి చెందినట్లు ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
- Tags
- dengue