- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర సర్వేతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంటుంది : మంత్రి దామోదర్ రాజనర్సింహ
దిశ, అందోల్: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించేందుకు, దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేను చేపడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం జోగిపేటలో కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 17,18,19 వార్డుల్లో పర్యటించిన మంత్రి కులగణనకు సంబంధించిన స్టిక్కర్‌లను ఇండ్లకు అతికించి, కుటుంబ సభ్యులకు సమగ్ర సర్వే ప్రాముఖ్యతను, అవశ్యకతను వివరించారు. సమగ్ర సర్వేను చేపడుతున్న అధికారులకు కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలను తెలియజేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. బ్రిటిష్ కాలంలో 1881లో కుల గణన జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 56 అంశాలు ఉండగా, వాటిలో ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాలు, ఉప కులాలకు సంబంధించిన ఇతరత్రా వివరాలను సేకరిస్తుందన్నారు. సమాజంలో ఏ వర్గం వారు ఏ స్థాయిలో ఉన్నారన్న విషయం తెలుస్తుందన్నారు.
ఈ వివరాల ఆధారంగా రాబోవు రోజుల్లో ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెట్టేందుకు వీలు ఉంటుందన్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం తో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువబోతున్నామన్నారు. జిల్లాలో 26 మండలాల్లో 4 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షలు, అర్బన్ పరిధిలో 1.65 లక్షల కుటుంబాలు ఉన్నాయని, 150 కుటుంబాలకు ఒక ఎన్యునేటర్‌ను నియమించామన్నారు. నెలలోపు ఈ సర్వేను పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ అదనపు కలెక్టర్ మనోజ్, ఆర్‌డీవో పాండు, డీసీసీబీ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి గీతా, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, ఆకుల చిట్టిబాబు, డి.శివశంకర్, నాని నాగరాజŒ , హరికృష్ణాగౌడ్, దుర్గేష్, చందర్ నాయక్, ఎంపీడీవో రాజేష్, ఎంపీవో అశోక్, మాజీ కౌన్సిలర్‌లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబు, మాజీ వార్డు మెంబర్లు పి.ప్రవీణ్‌కుమార్, సీహెచ్.శివకుమార్, నాయకులు రామకృష్ణ, మధు, రాజశేఖర్, సతీష్, రవి, శ్రీనివాస్, రాములుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో మంత్రికి వినతులు...హమీలు..
సమగ్ర కుటుంబ, కుల గణన సర్వే ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి 17,18,19 వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లోని ప్రజలు వివిధ రకాల సమస్యలతో కూడిన వినతులను మంత్రి దృష్టికి తీసుకేళ్లారు. పట్టణానికి చెందిన మొచి సంఘం సభ్యులు స్థలం ఉన్నప్పటికీ, తమకు నూతన భవనం కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా రూ.10 లక్షలను మంజూరు చేస్తానని మంత్రి హామీనిచ్చారు. మంత్రిని మసీదులోకి ఆహ్వనించిన ముస్లీం మత పెద్దలు బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ పునఃనిర్మాణం జరిగేలా చర్యలు తీసుకొవాలని కొరారు. దీంతో ఆయన స్పందించి ముస్లీం మత పెద్దలతో కలిసి కమిటీని వేసి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టుకుందామన్నారు. మున్సిపాలిటీలో గత 30 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో కార్మికులకు పనిచేస్తున్న తమను పర్మినేంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కొరుతూ కార్మికులు మంత్రికి వినతి పత్రాన్ని అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం మహిళలతో కలిసి సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.