- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కడి చెత్త అక్కడే.. అయినా పట్టించుకోని బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యం..
దిశ, సంగారెడ్డి అర్బన్ : 'పంట పొలాల్లో బీర్ ఫ్యాక్టరీ వ్యర్ధాలు' పేరిట ఈ నెల 19న దిశలో ప్రత్యేక కథనం వచ్చింది. దీనికి జిల్లా పంచాయతీ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది స్పందించి చెత్త వేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. వెంటనే అదే రోజు సాయంత్రం లోపు అక్కడి నుంచి చెత్తాచెదారం ఇతర వ్యర్ధాలు అన్ని తీసివేయాలని ఆదేశించి వెళ్లారు. నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ ఫసల్ వాది గ్రామ శివారులోని పంట పొలాల్లో శివంపేట శివారు బీరు ఫ్యాక్టరీ యాజమాన్యం వేసిన చెత్తను నేటికీ తీయలేదు.
అధికారులు వచ్చి చెత్తను తొలగించాలని ఆదేశించినప్పటికీ ఫ్యాక్టరీ సిబ్బంది ఏ మాత్రం స్పందించకపోవడం విడ్డూరం. ఏ స్థాయి అధికారులు వచ్చినా తమని ఏమి చేయలేరనే ధీమాతో ఇలా వ్యవహరిస్తున్నారా అంటూ స్థానిక గ్రామస్తులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బీరు ఫ్యాక్టరీ యాజమాన్యం సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొని అక్కడి నుంచి చెత్తను తొలగించేలా చూడాలంటూ వారు కోరుతున్నారు.