70 ఏళ్ల కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదు

by Disha Web Desk 15 |
70 ఏళ్ల కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదు
X

దిశ, సంగారెడ్డి : 70 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి చేసింది శూన్యమని, కేవలం కుటుంబ సభ్యులను చూసుకునే పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమిళి సై మాట్లాడుతూ కేవలం కుటుంబ సభ్యులను చూసుకునే పార్టీ కాంగ్రెస్ అని, దేశంలో ఉన్న 150 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది మోదీ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి చేసింది ఏమీ లేదని, అసలు ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్

అధికారంలో ఉన్నాఅభివృద్ధి చేసింది శూన్య అని, అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యం, అందుకే దేశ ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారని అన్నారు. దేశ భద్రత రక్షణకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆయన జీవితమన్నారు. దానిని వక్రీకరించి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆరోపిస్తున్నాయన్నారు. కరోనాలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించింది మోదీ ప్రభుత్వం దేశంలో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇప్పించారని గుర్తు చేశారు. వారందరూ తప్పకుండా మోదీకి ఓటు వేస్తారన్నారు. 25 కోట్ల ప్రజలను బీపీఎల్ నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత మోదీదని కొనియాడారు. చాలా మంది ఎంపీలు తెలంగాణ నుంచి గెలవాలి..వారికి మంత్రి పదవులు రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

తెలంగాణ ప్రజలకు నాకు మధ్య గ్యాప్ సృష్టించింది బీఆర్ఎస్..

తెలంగాణ ప్రజలకు నాకు మధ్య గ్యాప్ సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ నేతలే అని ఆరోపించారు. చాలా మంది మీరు గవర్నర్ పదవిని ఎందుకు వదిలారు అని అడుగుతున్నారని, అడిగిన వారికి ఒక్కటే చెబుతున్న ప్రజలతో ఉండటానికి ప్రజలకోసం పనిచేయడానికి గవర్నర్ పదవిని సైతం వదిలేశానన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించడానికి అనేక విధాలుగా ప్రయత్నించానని తెలిపారు. ఒక్కసారి కూడా నా ప్రయత్నానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందించడమే తన లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో తనకే తెలియదని ఎద్దేవా చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోతారని రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పి కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి అర్హత ఎవరికీ లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని, బీఆర్ఎస్ అస్సలు పోటీ కాదని, మీరు ఏ పార్టీ కి ఓటు వేసినా గెలిచేది మోదీనే అన్నారు. నేను ఇప్పుడు గవర్నర్ కాదని, ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డా.రాజుగౌడ్, కసిని వాసు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed