ఛత్తీస్‌గఢ్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపి యువకుడు సూసైడ్..!

by Satheesh |   ( Updated:2024-05-18 12:53:10.0  )
ఛత్తీస్‌గఢ్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపి యువకుడు సూసైడ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిరాతకంగా హత్యచేసిన ఓ వ్యక్తి.. చివరకు ఇంటికి వెళ్లి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన బలోదాబజార్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. భయంకరంగా పడి ఉన్న మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేప్టటారు. ఒకేసారి ఐదుగురిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి ఐదుగురు హత్యకు గురి కావడం, ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం బలోదాబజార్ జిల్లాలో సంచలనంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed