ఉమెన్స్ డే సందర్భంగా.. షీ టీం ఆధ్వర్యంలో 5 కే రన్

by samatah |   ( Updated:2023-03-08 05:25:33.0  )
ఉమెన్స్ డే సందర్భంగా.. షీ టీం ఆధ్వర్యంలో 5 కే రన్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మహిళా అభ్యన్నతే..సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు. హరీష్ రావు స్ఫష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలో షీ టీం ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు. 5కే రన్ ను జిల్లా మేజిస్ట్రేట్ రఘురామ్, పోలీసు కమిషనర్ శ్వేత, జెడ్పీ చైర్ పర్సన్ వేలేటీ. రోజాశర్మ, మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు లతో కలిసి మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా విద్య కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలు, మహిళా డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇటీవల ఏ పరీక్షా ఫలితాలు వచ్చినా విద్యార్థినీలే ప్రథమ స్థానం సాధించడం సంతోషంగా ఉందన్నారు. 5కే రన్ పోటీలో బాలికల విభాగంలో కావ్య (ప్రథమ), హరిక(ద్వితియ), హిందు (తృతీయ) స్థానంలో, బాలికల విభాగంలో అకిల్ (ప్రథమ), అభిషేక్ (ద్వితియ), అకిల్ (తృతీయ) స్థానంలో నిలిచారు. విజేతలకు మంత్రి హరీష్ రావు, ముఖ్య అతిధులు బహుమతులు, నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం

సిద్ధిపేట క్రీడా మైదానంలో పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాంతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల- రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత-వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story