- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ పరీక్షకు 2,778 మంది హాజరు : 33 మంది అభ్యర్థులు గైర్హాజరు
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ పరీక్ష సంగారెడ్డిలో ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మొత్తం 8 సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించారు. సంగారెడ్డిలోని ఎస్.వి జూనియర్ కాలేజిలో మొత్తం 600 మంది అభ్యర్థులు ఉండగా ఇందులో 594 మంది హాజరు కాగా 6 మంది గైర్హాజరయ్యారు. కరుణా స్కూల్ లో మొత్తం 456 మంది అభ్యర్థులు ఉండగా ఇందులో 449 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు.
సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో మొత్తం 360 మంది ఉండగా ఇందులో 359 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. అలాగే సెయింట్ ఆంథోనీ హైస్కూల్ లో మొత్తం 360 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 353 మంది హాజరు కాగా ఏడుగురు మంది గైర్హాజరయ్యారు. సెయింట్ ఆంథోనీ జూనియర్ కాలేజిలో మొత్తం 360 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 353 మంది హాజరు కాగా ఏడురుగు గైర్హాజరయ్యారు. అలాగే పయనీర్స్ స్కూల్ లో మొత్తం 288 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 286 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజయ్యారు.
రిషి హై స్కూల్ లో మొత్తం 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 239 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో మొత్తం 147 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 145 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరు అయ్యారు. కాగా సంగారెడ్డిలో 8 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2, 811మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 2,778 మంది హాజరు కాగా 33 మంది గైర్హాజరు అయ్యారని నీట్ పరీక్ష నిర్వాహకులు సంగారెడ్డి కో ఆర్డినేటర్ ఈ.జ్యోతి రెడ్డి తెలిపారు.