- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
20% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

దిశ, నిజాంపేట: అనధికార లే అవుట్ ప్లాట్లను క్రమబద్ధకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చ్ 31 2025 లో క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 20% రాయితీ లభిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు రుసుము చెల్లించి రాయితీని పొందుతూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారన్నారు.
జిల్లా వ్యాప్తంగా 22 వేల దరఖాస్తులు క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని ఇంటి యజమానులకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. దరఖాస్తుదారులకు 25% రాయిని ఇస్తూ, వెంట వెంటనే క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పని చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. మిగిలిన దరఖాస్తుదారులు నిర్ణీత గడువు లోపు రుసుము చెల్లించి తమ ఫ్లాట పై రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితా ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎల్ఆర్ఎస్ ను క్రమబద్ధీకరణను ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని దరఖాస్తుదారులకు ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకోవడంపై మున్సిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలపడం జరిగిందన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో ఎంపీడీవోలు ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఈనెల 31 లోపు 25% రాయితీని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు 9154293341, రామాయంపేట హెల్ప్ లైన్ నెంబర్ 9963290800 లలో సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు ఉన్నారు.