ఎన్నికల శిక్షణకు హాజరుకాని 15 మంది ఉపాధ్యాయుల సస్పెండ్

by Disha Web Desk 11 |
ఎన్నికల శిక్షణకు హాజరుకాని 15 మంది ఉపాధ్యాయుల సస్పెండ్
X

దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పీఓ, ఏపీఓ, ఓపీఓ శిక్షణకు హాజరుకానీ 15 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు విడుదల చేశారు. శిక్షణకు హాజరుకాకపోవడంతో వివరణ కోరుతూ తాఖీదులు జారీ చేసిన వారి నుంచి ఎటువంటి వివరణ రాకపోవడంతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలతో 15 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. 5 మంది పీఓ/ఏపీఓ, 10 మంది ఓపీఓలను సస్పెండ్ చేయడం జిల్లా ఉపాద్యాయవర్గాల్లో చర్చకు తెరలేపింది.

సస్పెండ్ అయిన ఐదు మంది పీఓ/ఏపీఓలు మునిపల్లి మండలం లోనికలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు దశరథ్, కొండాపూర్ మండలం మల్కాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బి.మల్లేశ్వరి, పటాన్ చెరు మండలం పటాన్ చెరు ఉన్నత పాఠశాల పీఈటీ టి.యేసుపాధం, జిన్నారం మండలం నల్తూరు ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయుడు జి.విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు.

అదే విధంగా మరో 10 మంది ఓపీఓలు కంగ్టి మండలం ఎంకెమూరి ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎల్.సావిత్రి, నాగిల్ గిద్ద మండలం లస్కరి తండా ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు కె.శ్యామల, హత్నూర మండలం చింతల్ చెరువు ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు జి.రాధాదేవి, కోహీర్ మండలం బిలాల్ పూర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు టి.స్వప్న, రామచంద్రాపురం మండలం వెలిమెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ ఎన్,రామక్రిష్ణ చారి, జహీరాబాద్ మండలం కసబ్ గల్లి బాలికల హైస్కూల్ ఓఎస్ పాండు, రంజోల్ ప్రైమరి పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీశైలం, హత్నూర మండలం కొడిపాక ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు ఎ.శ్రీనివాస్, రాయికోడ్ మండలం పీపడ్ పల్లి యూపీఎస్ ఎల్.పీ. లాల్ సింగ్ నాయక్, పుల్ కల్ మండలం బస్వాపూర్ యూపీఎస్ ఉపాధ్యాయుడు కె.విజయ్ బాష్కర్ లను డీఈఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed