రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే.. ఎమ్మెల్యే

by Sumithra |
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే.. ఎమ్మెల్యే
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లా కేంద్రం టీఎన్జీవో భవన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. నవంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే కార్యక్రమం మొదలవుతుందని అన్నారు. మెదక్ జిల్లా పరిధిలో రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,20,000 సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇంత పకడ్బందీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన పార్టీ ఓకే ఒక్క పార్టీ అది బీజేపీ పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మనం వారి వద్దకు వెళ్లి అడగాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బీజేపీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలన్నారు. 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఒకేసారి ఇప్పుడు కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు బీజేపీ వైపు ప్రజల మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అని ప్రజలకు తెలిసేలా వ్యవహరించాలని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏకకాలంలో ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు మాట మారుస్తున్నారాని అన్నారు. రైతులకు రుణమాఫీ ఇప్పటివరకు 30% నుంచి 40% మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగిందని అన్నారు. రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసేవిధంగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా పాలన సాగించారని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నడుస్తుందన్నారు.

వచ్చే మూడు సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే మూడు కొత్త చట్టాలను మోడీ ఆమోదించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా ప్రభాకర్ మెదక్ జిల్లా ప్రబారి మురళీధర్ గౌడ్, బీజేపీ నాయకులు రామ్మోహన్, రాగి రాములు, కర్ణం పరిణిత, రఘువీర్ రెడ్డి, ఎమ్ఎల్ఎన్ రెడ్డి, సుభాష్ గౌడ్, రాజేందర్, పంజా విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెదక్ మెడికల్ కళాశాల మంజూరు అయిన నేపథ్యంలో గడ్డం శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి కొత్త బస్టాప్ ప్రధాన రహదారి పై నరేంద్ర మోడీ, నడ్డా, కిషన్ రెడ్డి, రఘునందన్ రావుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ మెడికల్ కళాశాల మంజూరులో కేంద్ర ప్రభుత్వం, ఎంపీ రఘునందన్ రావు పాత్ర కీలకమని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed