- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ- కాంగ్రెస్‌లో చిచ్చురేపిన మైనంపల్లి జాయినింగ్.. రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు గుడ్ బై..!
దిశ, డైనమిక్ బ్యూరో/ మేడ్చల్ ప్రతినిధి: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు టీ-కాంగ్రెస్‌లో చిచ్చురేపారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన హన్మంతరావు వ్యవహారంతో రోజు వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు జిల్లా అధ్యక్షులు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి రెండు టికెట్లు ఆశిస్తున్నారు. మల్కాజ్ గిరి నుంచి తనకు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఆశిస్తుండటంతో మైనంపల్లి డిమాండ్‌కు అధిష్టానం సైతం ఓకే చెప్పినట్లు ప్రచారం జురుగుతున్నది.
దీంతో మైనంపల్లి చేరిక పట్ల అసంతృప్తితో ఉన్న మెదక్ డీసీసీ చీఫ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా సోమవారం మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు.
అనుచరులతో సమావేశం అనంతరం నిర్ణయం:
మల్కాజ్‌గిరి టికెట్ మైనంపల్లికే కన్ఫర్మ్ అయిందనే ప్రచారంతో శ్రీధర్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శ్రీధర్‌ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించింది. అయితే పార్టీ కోసం కష్టపడుతున్న తనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ వద్ద కోరిన శ్రీధర్ సోమవారం తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధిష్టానం తీరుపై తన అనుచరుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను 1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా పని చేస్తున్నానని.. 2018 నుంచి టికెట్ ఆశిస్తునప్పటికీ గత ఎన్నికల్లో అలయన్స్‌లో భాగంగా టికెట్ నిరాకరించినా పార్టీ కోసం కష్టపడి పని చేశానని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా హనుమంతరావు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు అతడినే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం తనను కలిచి వేసిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చేరికల వేళ కాంగ్రెస్‌లో కలకలం:
చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి దెబ్బకు ఇద్దరు డీసీసీలు రాజీనామా చేయడం కలకలంగా మారింది. ఈ పరిణామం కష్టకాలంలో కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని, ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలిచిన నాయకులకు సవాలుగా మారింది. కొత్తవారి చేరిక ఎంత మేరకు మేలు చేస్తుందో తెలియనప్పటికీ పాతవారు పార్టీని వీడటం కాంగ్రెస్ క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. మరి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నష్టనివారణ చర్యలకు దిగుతుందో చూడాలి.