సీఎం చాంబర్‌లో భారీగా వాస్తు మార్పులు?

by Rajesh |
సీఎం చాంబర్‌లో భారీగా వాస్తు మార్పులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియట్ ఆరో అంతస్తులో ఉన్న సీఎం చాంబర్‌లో వాస్తు మార్పులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇతర అధికారులకు ఇబ్బందులు కలగకుండా, కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పనులు జరుగుతున్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకే సీఎం రేవంత్ సెక్రటేరియట్‌కు రాకుండా, ఇతర ప్రాంతాల్లో రివ్యూలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ కోసం ఏర్పాటు చేసిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.

కానీ ఈ మధ్య కొందరు వాస్తు నిపుణుల సూచన మేరకు ఈస్ట్ ఫేస్‌లో ఉన్న చైర్‌ను, నార్త్ ఈస్ట్ వైపు మార్చుతున్నట్టు తెలిసింది. దీంతో ఆ చాంబర్ లో ఉన్న ఫాల్ సీలింగ్, టేబుల్స్, సోఫాలు అన్నింటినీ చేంజ్ చేసి, కొత్తగా డోర్లు, కిటికీలకు రంగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే మార్పులు, చేర్పుల్లో భాగంగా సీఎం చాంబర్ పక్కనే ఉన్న సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ రూమ్ స్పేస్‌ను సైతం ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. దీంతో సీఎస్ఓకు మరో చోట గదిని కేటాయించే చాన్స్ ఉంది.

ఇప్పటికే ప్రధాన గేటుకు తాళం

వాస్తుకు విరుద్ధంగా ఉందనే కారణంతో సెక్రటేరియట్‌కు ఉన్న ప్రధాన గేటుకు తాళం వేశారు. ఆ గేటు గుండా రాకపోకలను నిషేధించారు. దీంతో మంత్రులు, ఐఏఎస్ అధికారులు తమకు అనుకూలంగా ఉన్న గేటు గుండాలోనికి వస్తున్నారు. సీఎం కాన్వాయి వెస్ట్ సైడ్ ఉన్న గేటు నుంచి సెక్రటేరియట్ లోనికి వచ్చి, వెళ్లేటప్పుడు నార్త్ ఈస్ట్ గేటును ఉపయోగించే విధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed