- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పురుగుల మందు డబ్బాలతో కలెక్టరేట్ వద్ద దళితుల భారీ ధర్నా
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలానికి చెందిన పలు గ్రామాల దళితులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో భాగంగా అధికారులు విజ్ఞప్తులు స్వీకరిస్తున్న క్రమంలో దాదాపు వందమందికిపైగా దళితులు అక్కడకు చేరుకున్నారు. చేతిలో పురుగులమందు డబ్బాలు పట్టుకొచ్చి తమకు దళితబంధు డబ్బులు మంజూరు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్క లబ్ధిదారుడు 10 నుంచి 15 సార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఆ దరఖాస్తులు ఎంపీడీఓ కార్యాలయాన్ని దాటి జిల్లా కలెక్టరేట్‌కు చేరడం లేదని ఆవేదన చెందారు. మొదట్లో తమ అకౌంట్లలో 9.90 లక్షలు వేసి, ఆ తర్వాత హోల్డ్‌లో పెట్టారని, దీంతో తాము ఈ పథకం ద్వారా లబ్ది పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను ఎప్పుడు అడిగినా వారం వారం అంటూ ఏడాది కాలంగా కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని లబ్ధిదారుల నుంచి అర్జీలు తీసుకొని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.