మాసాబ్ చెరువు మాయం? అయినా అధికారులు సైలెంట్!

by Rajesh |
మాసాబ్ చెరువు మాయం? అయినా అధికారులు సైలెంట్!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలోని చెరువులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయం లేకపోవడంతోనే చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. తుర్కయంజాల్లోని సాగర్ రోడ్డుకు అనుకోని ఉన్న మాసాబ్ చెరువును మట్టితో పూడిచివేస్తున్నారు. ఈ చెరువు సుమారు 506 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కొంత మంది రియల్ వ్యాపారాలు పూడ్చివేస్తూ ఇప్పుడు 326 ఎకరాల విస్తీర్ణతకు తగ్గింది. గత కొన్నేళ్లుగా చెరువులోకి నీరు చేరకుండా రియల్టర్లు చుట్టూరా వెంచర్లు ఏర్పాటు చేసి అమ్మేసుకున్నారు. దీనికి హద్దురాళ్లు అంటూ ఏమీ లేకపోవడంతోనే వ్యాపారులు ఇస్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారు.

ఈ కాలనీలను కాపాడేందుకే

తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్, ఇటు కుర్మల్ గూడ, యంజాల్ గంగిరెడ్డి కాలనీ వెనుక వెంచర్లు వెలిశాయి. రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు ఆ వెంచర్లన్నీ నేటికీ నీట మునిగే ఉన్నాయి. ఇప్పట్లో అవి నీటిలో నుంచి బయటపడే అవకాశమే లేదు. దీంతో రియల్టర్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో రాత్రి పూట కొన్నిసార్లు తూము తెరిచి నీటిని వదిలే ప్రయత్నం చేశారు. అది గమనించిన స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చెరువు నీటిలో మట్టిని నింపి వెంచర్లను వెలికితీయాలన్న చూస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే వ్యవహారిస్తున్నారు. కండ్ల ముందే చెరువులు కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రియల్ వ్యాపారుల చేతిలో అధికారులు కీలుబొమ్మగా మారారన్న ఆరోపణలున్నాయి. చేతివాటాలకు అలవాటు పడిన అధికారులు ఎన్వోసీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed