BREAKING: కాంగ్రెస్‌కు గుడ్ బై.. బీజేపీలో చేరిన మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి

by Satheesh |
BREAKING: కాంగ్రెస్‌కు గుడ్ బై.. బీజేపీలో చేరిన మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో నేడు బీజేపీలో చేరారు. అస్సాం మాజీ సీఎం, కేంద్రమంత్రి శర్బానంద్ సోనావాల్ ఆధ్వర్యంలో మర్రి శశిధర్ రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ అరవింద్ సహ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్భానంద్ సోనోవాల్ మాట్లాడుతూ.. మర్రి శశిధర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని విమర్శించారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధే జరగలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే టీఆర్ఎస్ లాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కంటే సీఎం కేసీఆర్‌కి కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.

Next Story