అర్ధరాత్రి మల్లారెడ్డి మనుమరాలిని తీసుకెళ్లిన పోలీసులు

by GSrikanth |
అర్ధరాత్రి మల్లారెడ్డి మనుమరాలిని తీసుకెళ్లిన పోలీసులు
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: ఐటీ రైడ్స్ పేరిట మోడీ సర్కార్‌ దాష్టికానికి పాల్పడుతోందని మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి మర్రి లక్షణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయారెడ్డిని అర్ధరాత్రి మహిళా అధికారులు లేకుండా ముగ్గురు సీఆర్పీఎఫ్ అధికారులు బ్యాంకు లాకర్లు తెరవాలని అని తీసుకెళ్లారని సీరియస్ అయ్యారు. ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో మహిళా అధికారులు లేకుండా ఒక అమ్మాయిని ఎలా తీసుకెళ్తారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. తెలంగాణ మీద వరుస దాడులకు తెగబడుతు ఇవాళ ఒక తెలంగాణ ఆడబిడ్డకు చేసిన అవమానం మేము గుర్తుంచుకుంటాం. రేపు నీకు కర్రుకాల్చి వాతపెడతామని హెచ్చరించారు.

Next Story

Most Viewed