మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-30 06:01:59.0  )
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోడీ రెడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి ప్రధాని ప్రస్తావించారు. భారతీయ వస్తువులను ప్రసాద్ ఎక్కువగా వినియోగిస్తారన్నారు. 2014లో విజయదశమి రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దేశ నలుమూలల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ ప్రొగ్రామ్ లో చర్చించామన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి మన్ కీ బాత్ వేదిక అయిందన్నారు.

ఛత్తీస్ గఢ్ లోని స్వయం సహాయక సంఘం పనిని ప్రధాని ప్రస్తావించారు. మహిళాశక్తిని ప్రధాని ప్రశంసించారు. మన్ కీ బాత్ లో భాగంగా గతంలో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తులతో మళ్లీ ఫోన్ లో మోడీ మాట్లాడారు. కశ్మీర్ లో సాగుతున్న పెన్సిల్ - స్టేట్ ప్రచారాన్ని ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ ప్రచారం 200 మందికి ఉపాధి కలిపిస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడినని మోడీ అన్నారు. ఢిల్లీకి వచ్చిన పరిస్థితి మారిపోయిందన్నారు. చాలాసార్లు ఒంటరితనం ఆవరించిందన్నారు. సెల్ఫీ విత్ డాటర్ ప్రచారాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed