CM కేసీఆర్ పని ఖతం.. నెక్ట్స్ కాంగ్రెస్‌దే అధికారం: మానిక్​రావు థాక్రే

by Satheesh |
CM కేసీఆర్ పని ఖతం.. నెక్ట్స్ కాంగ్రెస్‌దే అధికారం: మానిక్​రావు థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్​ పని ఖతమైనట్టేనని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్​రావు థాక్రే పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. 9 ఏళ్లల్లో బీఆర్ఎస్ ​ప్రభుత్వం ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదన్నారు. దీంతో యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ​పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రియాంక గాంధీ అందరిలో భరోసా నింపేందుకు వస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ఆధ్వర్యంలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌లు నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలమైనట్లు విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే.. కేసీఆర్​దాన్ని తన అవసరానికి అనువుగా మార్చుకొని లబ్ధి చేకూర్చుకున్నట్లు వెల్లడించారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. అక్టోబర్‌లో షెడ్యూల్ వస్తే.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

గతంలో బీఆర్ఎస్​ప్రభుత్వం 80 వేల39 పోస్టులు భర్తీ చేసి, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిందని, కానీ ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదన్నారు. పైగా పేపర్​లీకేజ్‌లు నిత్యకృత్యమయ్యాయని స్పష్టం చేశారు. కేసీఆర్ అసమర్ధత, అవినీతి వల్లే పేపర్​లీకేజీ అయిందన్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్ -1 పోస్టులకు ఏకంగా మూడున్నర లక్షల మంది, 17 వేల పోలీస్​ఉద్యోగాలకు 12 లక్షల మంది అప్లై చేసుకున్న తీరును పరిశీలిస్తేనే నిరుద్యోగ తీవ్రత అర్థం అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed