- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manda Krishna: సీతారాం ఏచూరి గొప్ప నాయకుడు
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) భౌతిక కాయానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) నివాళులు అర్పించారు. మాదిగల పోరాటానికి సీతారాం ఏచూరి చివరి వరకూ అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఆయన మొత్తం జీవితాన్ని సమాజానికే అంకితం చేశారని తెలిపారు. మరోవైపు.. సీతారాం ఏచూరి పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదు. తాను చనిపోతే.. తన పార్థివదేహాన్ని వైద్య పరీక్షల కోసం.. వైద్య విద్యార్థుల రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవాలని బతికి ఉన్నపుడే సీతారాం ఏచూరి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీ(AIIMS Medical College)కి దానం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాసేపట్లో ఎయిమ్స్ కాలేజీకి బాడీని అప్పగించనున్నారు.