- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Instagram: నిందితుడి ఫోన్ లో వేల సంఖ్యలో మహిళల ఫోటోలు.. పబ్లిక్ ప్లేస్ లో తీసి ఇన్ స్టాలో పోస్టు

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించే కేటుగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇటీవల జగిత్యాలలో (jagityala) అజ్ఞాత వ్యక్తి పబ్లిక్ ప్లేస్ లో దొంగచాటుగా మహిళలు, యువతుల ఫోటోలు తీసి వాటిని ఇన్ స్టా గ్రామ్ (instagram) లో అసభ్యకర రీతిలో పోస్టులు చేయడం తీవ్ర కలకలం రేపింది. అనేక మంది అమాయక మహిళల ఫోటోలు దర్శనం ఇవ్వడంతో అందరూ టెన్షన్ పడ్డారు. ఈ వ్యవహారంపై ఈ నెల 11న ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజుల్లోనే ఆ కేసును ఛేదించారు. ఈ పాడుపనులు చేస్తున్న నీచుడిని జగిత్యాల పోలీసులు (jagityala police) అరెస్టు చేశారు. నిందితుడిని జగిత్యాల జిల్లా గోపులపూర్ గ్రామానికి చెందిన బండారి శ్రవణ్ గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. గత కొంత కాలంగా పట్టణంలో మార్కెట్, బస్డాండ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చే మహిళలు, యువతుల ఫోటోలను ఫోటోలు తీస్తూ వాటిని తైస్ అండ్ లెగ్గిన్స్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ అశ్లీలంగా పోస్టులు చేస్తున్నాడు. తమకు అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని నిందితుడి అరెస్టు చేసి చట్టపరంగా చర్యలసు తీసుకుంటామన్నారు. నిందితుడు గతంలో మొబైల్ షాప్ నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి ఇన్ స్టా అకౌంట్ ను బ్లాక్ చేయించామని, దితుడి ఫోన్ లో వేల సంఖ్యలో మహిళల ఫోటోలు, వీడియోలు గుర్తించామని తెలిపారు.