మైనంపల్లి చేరిక.. నందికంటి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-29 08:05:50.0  )
మైనంపల్లి చేరిక.. నందికంటి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మైనంపల్లి హన్మంతరావు నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు రోహిత్ కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక ఇదే అంశంపై మల్కాజ్ గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లిని పార్టీలో చేర్చుకోవడం అధిష్టానం ఇష్టమన్నారు. మైనంపల్లికి రెండు సీట్లు మరెక్కడైనా ఇవ్వాలన్నారు. మల్కాజ్ గిరి సీటు మాత్రం తనకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్ ను కోరినట్లు తెలిపారు. రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే క్యాడర్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా అన్నారు.

Advertisement

Next Story