Telangana Congress: పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే పవర్

by Gantepaka Srikanth |
Telangana Congress: పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే పవర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ఏడాదిలో టీపీసీసీ కొత్త కమిటీలు రాబోతున్నాయని చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేస్తానని క్లారిటీ ఇచ్చారు. పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే పవర్ అంటూ స్పష్టం చేశారు. ఇందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు, కార్యకర్తలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక 2024 సంవత్సరం తన రాజకీయ జీవితంలో కీలకమైందని గుర్తుచేశారు. గత ఏడాదిలో ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు సాధించామన్నారు. గత ఏడాదిలో రాజకీయ నాయకుడిగా చట్ట సభలో అడుగుపెట్టానని, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గొప్ప పదవిలో ఉన్నానని వివరించారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.

Advertisement

Next Story