కేసీఆర్ అవినీతి సామ్రాట్.. అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ దోచుకున్న రికార్డ్ ఆయనదే: మహేష్ కుమార్ గౌడ్

by Satheesh |   ( Updated:2023-09-19 10:16:49.0  )
కేసీఆర్ అవినీతి సామ్రాట్.. అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ దోచుకున్న రికార్డ్ ఆయనదే: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా బిల్లును కాంగ్రెస్ స్వాగతిస్తోందని టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇవాళ ఆయన గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తన వల్లే అని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ ఉద్యమం చేసింది.. పోరాటం చేసింది అని నిలదీశారు. కేబినెట్‌లో ఒక్క మహిళ లేదని తండ్రిని అడగలేని ధైర్యం కవితదని అన్నారు.

అలా అన్ని నమ్ముకుంటే పోతే చంద్రయాన్ రాకెట్ నేనే చేసిన అని కవిత చెబుతుందని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లు కాంగ్రెస్ మానస పుత్రిక అని చెప్పారు. ప్రపంచంలో అవినీతి సామ్రాట్ కేసీఆర్ అని, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ మాత్రమే నని అన్నారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో బినామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దేశ హోంమంత్రి అమిత్ షా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. బ్రిటిష్ వారి నీతిని బీజేపీ అనుసరిస్తోందన్నారు. ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పారు. గుండు సూది తయారుకాని దశ నుంచి రాకెట్ పంపించే స్థాయి వరకు భారత్ ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉందని చెప్పారు.

1981లో పుట్టిన బీజేపీకి మాట్లాడే అర్హత లేదని అన్నారు. రజాకార్ ఫైల్స్ సినిమాతో ఏమి చేసుకుంటారని ప్రశ్నించారు. రజాకార్లు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, ఎన్ని రెచ్చగొట్టే సినిమాలు తీసినా.. శాంతిభద్రతలను దెబ్బతీయలేరని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed