- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
600 ఏళ్ల నాటి మెట్ల బావికి మహర్దశ.. వైరల్ అవుతున్న KTR Tweet
దిశ, భువనగిరి రూరల్: తెలంగాణలోని వారసత్వ ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని వేంకటేశ్వర ఆలయంలోని 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఆయన షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ జిల్లాలో వైరల్ గా మారడంతో కేటీఆర్ ట్వీట్ పట్ల రాయగిరి వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ లోని బన్సిలాల్ పేట మెట్ల బావిని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. కాగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ రాయగిరిలోని మెట్ల బావిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని గత కొద్ది రోజుల కిందటే ప్రకటించారు. యాదాద్రికి వచ్చిన భక్తులు మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.