- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TUWJ IJU state secretary : జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం..
దిశ, నారాయణపేట ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యూనియన్ తరపున పనిచేస్తామని, జర్నలిస్టు వృత్తి ఎంతో పవిత్రమైనదని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణపేట జిల్లా జర్నలిస్టుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అంశం పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల డీఈఓలకు యునియన్ తరపున జీవో జారీ చేశారని, అలాగే ఇళ్ల స్థలాల విషయం పై రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలని సర్కులర్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర యూనియన్ నాయకులు విరాహత్ అలీ ఇతర రాష్ట్ర బాధ్యులతో చర్చించి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా ఉంటామన్నారు. ప్రభుత్వం నుంచి జారీ అయ్యే అక్రిడేషన్ కార్డు తో పాటు హెల్త్ కార్డు వచ్చేలా అధికారికంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను మొదటగా జర్నలిస్టులకు మంజూరు చేయాలని కోరారు.
మాగనూరు మండల రిపోర్టర్ వెంకట పతి ఇటీవల మృతి చెందాడని వారి కుటుంబానికి ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందలేదని చెప్పగా బాదిత కుటుంబానికి రూ. లక్ష చెక్కును అకాడమీ చైర్మన్ మంజూరు చేశారన్నారు. మృతి చెందిన జర్నలిస్టు పిల్లలకు నెలకు రూ. 1000 చొప్పున చదువు కోసం ఆర్థిక సహాయం అలాగే బాదిత కుటుంబానికి మూడు సంవత్సరాలపాటు నెలకు రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం ప్రెస్ అకాడమీ తరఫున అందుతుందన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చిన యూనియన్ నాయకులు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం రైతులకు రైతు భీమా అందిస్తున్నట్లు జర్నలిస్టులకు కూడా జర్నలిస్ట్ బీమాను అందించే భరోసా కల్పించాలని పలువురు జర్నలిస్టులు రాష్ట్ర బాధ్యులకు కోరారు. జర్నలిజం వృత్తిలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఇప్పటికీ సొంత ఇళ్లు లేవనీ యూనియన్ నాయకులు ప్రభుత్వం పై ఒత్తిడి చేసి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోయిలకొండ నారాయణరెడ్డి, వాకిటి అంజయ్య, శ్రీనివాస్, రఘు గణప, నక్క శ్రీనివాస్, తఖి, ప్రతాప్ రెడ్డి, విటోబా, భాస్కర్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, ఆంజనేయులు, రాఘవేంద్ర, వెంకట్ రాములు, అశోక్ మధుకర్, బాల్ రాజ్, జగన్నాథ్ నాయక్, సురేష్, భానుచందర్, సల్మాన్, మహ్మద్ హుస్సేన్ తో పాటు జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.