- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
76 ఏళ్ల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఓటేసిన ఆదివాసీలు
దిశ, అచ్చంపేట : 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొన్నటి వరకు నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ఏజెన్సీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసి చెంచు గిరిజనులు ఏనాడు స్థానికంగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా నల్లమల లోతట్టు ప్రాంతంలోని లింగాల అమ్రాబాద్ మండలం పరిధిలో ఉన్న ఫరహాబాద్, పుల్లాయపల్లి, మల్లాపూర్, ఈర్లపెంట, సంగిడి గుండాల, మేడి మలకల తదితర గూడాలలో 9 పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాత, తండ్రుల నాడు కూడా లేదు..
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు స్థానికంగా ఆదివాసి చెంచు గూడాలలో ప్రభుత్వాలు స్థానికంగా ఓటు సౌకర్యం కల్పించలేదు. ప్రస్తుతం నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాకు స్థానికంగా ఓటు స్వేచ్ఛగా చేసుకుని సౌకర్యం కల్పించిన కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.