ట్రస్టు సేవలు యధావిధిగా కొనసాగుతాయి..! మర్రి జనార్దన్ రెడ్డి

by Sumithra |
ట్రస్టు సేవలు యధావిధిగా కొనసాగుతాయి..! మర్రి జనార్దన్ రెడ్డి
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి : తన ఆరోగ్య కారణాలవల్ల ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం మొదటిసారి బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తన ప్రవర్తన పట్ల ఎవరైనా మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. ఇప్పటివరకు తన తల్లిదండ్రులను కూడా క్షమించమని కోరలేదని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.

తాను ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తూ పాదయాత్ర చేపట్టిన క్రమంలో తన వెన్నుపూస దెబ్బతిని వైద్యుని సూచన మేరకు ఆరు నెలలపాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. తన సొంత ట్రస్టు ద్వారా ప్రస్తుతం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఐదు రూపాయల భోజనం, పేద ఆడబిడ్డలకు పెళ్లిళ్లు కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయన్నారు. కార్యకర్తలు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని తమకు అండగా డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బై కానీ శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తనతో పాటు నాయకులు నాగం శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed