- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల: తెలంగాణ విద్యుత్ రంగంలో అద్భుతంగా పురోగతి సాధించి దేశానికే దారి చూపే దశకు చేరుకుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రగతి సంబరాలు జడ్చర్ల చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాకముందు కరెంట్ వస్తే దినపత్రికల్లో వార్త వచ్చేదని, తెలంగాణ వచ్చాక ప్రస్తుతం కరెంట్ పోతే వార్త అవుతుందని అన్నారు. గతంలో కరెంట్ సరిగ్గా లేక వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు చేతి వృత్తులతో పాటు అనేక రంగాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
స్వరాష్ట్రంలో నిరంతరంగా 24 గంటల విద్యుత్ అందుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుండడంతో రైతులకు కరెంట్ తిప్పలు తప్పాయన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోతతో సామాన్య ప్రజలు అల్లాడిపోయిన రోజులను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజన్, దూరదృష్టి వల్ల నేడు విద్యుత్ సమస్య లేకుండా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్చర్ల డీఈ కృష్ణమూర్తి, మున్సిపాల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మీ రవీందర్, జడ్పీ సీఈవో జ్యోతి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.