మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు తీర్చాలె.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు

by Javid Pasha |   ( Updated:2022-12-17 14:16:18.0  )
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు తీర్చాలె.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు
X

దిశ , కొల్లాపూర్: మిషన్ భగీరథ కార్మికులు సమస్యలు తీర్చాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో ఉన్న మిషన్ భగీరథ పంపు హౌస్ వద్ద JAC ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వం గాలికొదిలేయడం బాధాకరమన్నారు. మిషన్ భగీరథ కార్మికుల వల్లే ప్రజలు నీటి కష్టాలు పడకుండా ఉన్నారని తెలిపారు. మిషన్ భగీరథలో పని చేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ప్రజల కోసం రేయిబవళ్లు కష్టపడుతున్న మిషన్ భగీరథ కార్మికులకు కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. వాళ్లకు హెల్త్ కార్డులతో పాటు సరిపడా జీతం, అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంటే శివన్న, జిల్లా జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్, రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ పరమేష్, కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా, ఎల్లూరు గ్రామ అధ్యక్షుడు పరశురాం యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story