- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో జూపల్లి చేరికకు డేట్ ఫిక్స్.. ఇంటికెళ్లి ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
దిశ, బ్యూరో మహబూబ్ నగర్: రెండున్నర నెలల ఉత్కంఠకు ఇక తెరపడనుంది. అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత జూపల్లి కృష్ణారావు, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొన్ని నెలలుగా సాగిన తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు జూపల్లి, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అయ్యారు. ఆ పార్టీలో చేరేందుకు జూపల్లి కృష్ణారావు కొన్ని షరతులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచడం, వాటికి ఆమోదం తెలపడంతో చేరికలకు ముహూర్తం ఖరారు అయ్యింది.
నేడు జూపల్లి ఇంటికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి
జూపల్లి కృష్ణారావు, ఎంపీపీలు కిచ్చా రెడ్డి, మెగా రెడ్డి, కూచుకుల్ల రాజేష్‌లను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జూపల్లి ఇంటికి వెళ్లనున్నారు. జూపల్లి ఇంట్లో మాట్లాడిన తర్వాత పార్టీలోకి ఆహ్వానిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి తో కలిసి జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈనెల 22వ తేదీన ఢిల్లీ వెళ్లి సోనియా, లేదా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా లో భారీ బహిరంగ సభను నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
జగదీశ్వర్ రావు అడుగులు ఎటువైపు
కొల్లాపూర్ నియోజకవర్గంలో నాయకులు లేకున్నా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. నాయకత్వ లేమి సమస్య తో పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, రాష్ట్ర నాయకులు జగదీశ్వరరావు బాధ్యతలను స్వీకరించి పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్లారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో జగదీశ్వరరావు, అభిలాష రావు ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. వనపర్తి నియోజకవర్గంలోనూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ను మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గట్టిగా ఆశిస్తున్నారు.
ఈ తరుణంలో టికెట్ ఆశిస్తూ మెగా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అందుకు జూపల్లి అండదండలు మెండుగా ఉండడంతో ఇప్పటిదాకా టికెట్ ఆశిస్తూ వచ్చిన చిన్నారెడ్డి, ఇంద్రసేనారెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ కూడా వనపర్తి నియోజకవర్గంలో నెలకొంటుంది. కొత్త నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయలుదేరుతాయా... లేక అందరూ కలిసికట్టుగా పనిచేసే పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తారా అన్న అంశం తెలియాల్సి ఉంది.
Also Read..
Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ