- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగిందని ఆందోళన
దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా నారాయణపేట జిల్లాలో ఉపాధ్యాయ అభ్యర్థుల వెరిఫికేషన్ ప్రక్రియలో తప్పులు సృష్టించి తమకు అన్యాయం చేశారని పలువురు డీఎస్సీ అభ్యర్థులు నారాయణపేట డీఈఓ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. 1:3 లో తమ ముందు ఉన్న అభ్యర్థి వెరిఫికేషన్ కు హాజరు కాకపోతే ఆయన్ని డిస్ క్వాలిఫై చేయకుండా పెండింగ్లో చూపడంతో తనకు ఉద్యోగం రాలేదని ఓ మహిళా అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు. మరొక అభ్యర్థి తనకు రెండు ఉద్యోగాలు వచ్చాయని తన విల్లింగ్ లెటర్ లేకుండానే మరో సబ్జెక్టును కేటాయించడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలా పలువురు అభ్యర్థులు స్థానిక డీఈఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టగా విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని, అవకతకలపై వెంటనే విచారణ జరిపించి పై అధికారులతో మాట్లాడి అభ్యర్థులకు ఉద్యోగం వచ్చేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి కొంతవరకు సద్దుమణిగింది. కొద్ది సేపటి తరువాత డీఎస్సీ అభ్యర్థులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు మధ్య మాటామాటా పెరగడంతో తిరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ విషయంపై డీఈఓ మాట్లాడుతూ 1:3 లిస్టును పైకి పంపడం జరిగిందని, దాని ప్రకారమే అభ్యర్థుల తుది జాబితా రూపొందించామని తెలిపారు. ఏమైనా తప్పులు ఉన్నట్లు తేలితే విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
- Tags
- DSC jobs