గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకం.. ఎమ్మెల్యే

by Sumithra |
గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకం.. ఎమ్మెల్యే
X

దిశ, గద్వాల టౌన్ : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గద్వాల నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను శాలువాలతో, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశీస్సులతో సహాయసహకారాలతో మేము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది. ఎమ్మెల్యే సహకారంతో తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో ప్రతిగ్రామాలలో కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తారు. ఈ ఐదేళ్ల పదవి కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాల అభివృద్ధితో పాటు గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో కృషి చేశారు. గత ప్రభుత్వాల కన్నా కేసీఆర్ పాలనలోనే గద్వాల నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అయిందని తెలిపారు.

ఎమ్మెల్యే అన్ని విధాలుగా అండగా ఉంటూ భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి మాకు ఎల్లప్పుడూ సహకరించాలని కోరారు. పదవీకాలం పూర్తి అయిన తర్వాత కూడా మేము నిరంతరం ఎమ్మెల్యే వెంటే ఉంటూ ప్రజా క్షేత్రంలోని ప్రజల కోసం పనిచేస్తూ గద్వాల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో పరిపాలించారని, ఎవరి వల్ల సాధ్యం కానీ అభివృద్ధి పదేళ్లలో కేసీఆర్ పాలనలోనే గద్వాల నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నారన్నారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, పల్లె ప్రకృతి వనాలు ఇలా అనేకమైన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా అందించి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు.

పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందించి అదేవిధంగా ప్రతి గ్రామంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామాలను కూడ అన్ని మౌలిక సదుపాయాలతో గ్రామాలలో మంచి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, డంపింగ్ యార్డ్లు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేసుకొని గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. మరొక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed