కొట్టుకుపోయిన రోడ్డు.. ఆరు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

by Nagam Mallesh |
కొట్టుకుపోయిన రోడ్డు.. ఆరు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ, గద్వాల: రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహం రహదారులపై చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ధరూర్ మండలంలోని నీళ్లహళ్లి, పాతాపాలెం గ్రామాల మధ్య ప్రవహించే వాగు మంగళవారం కురిసిన భారీ వర్షానికి పొంగి ప్రవహించింది. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పేరు నుంచి పాతపాలెం, వెంకటాపురం గ్రామాలకు నీళ్లహళ్లి వాగు మీదుగా రాకపోకల సాగిస్తుంటారు. గత సంవత్సరం నీళ్లహళ్లి వాగు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు నత్తనడక సాగడంతో బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలేదు. తాత్కాలికంగా పక్కన ఏర్పాటు చేసిన రోడ్డు మీద వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగిపొర్లడంతో మట్టి రోడ్డు తెగిపోయింది. దీంతో సుమారు అయిదారు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుపక్కల గ్రామాలకు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలకు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed