- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు
దిశ, రేవల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేవల్లి మండలంలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘా రెడ్డికి రేవల్లి మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రేవల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వస్తే ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాల పై, రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తారన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, 500 రూపాయలకే సిలిండర్, చదువుకునే విద్యార్థులకు స్కూటీల పంపిణీ, రైతులకు 15వేల పంట పెట్టుబడి సహాయం, కౌలు రైతులకు 12 వేల పంట పెట్టుబడి సహాయం, లాంటి అనేక పథకాలు అమలు అవుతాయని పేర్కొన్నారు.
అనంతరం తలుపునూరు, కేశంపేట, గౌరీదేవిపల్లి, రేవల్లి, శానాయపల్లి, నాగపూర్, బండ రవిపాకుల, చెన్నారం, తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రేవల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, ఎంపీటీసీ అంజనమ్మ రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు, చెన్నారం ఎంపీటీసీ వల్లమ్మ శాంతయ్య, ఉమ్మడి గోపాల్పేట మండలం వైస్ఎంపీపీ వెంకటేష్, పోల్కపహాడ్ మాజీసర్పంచ్ సత్య శీలా రెడ్డి, బండరావిపాకుల మాజీ సర్పంచ్, బాలస్వామి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీస రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల ముఖ్యనాయకులు, మాజీసర్పంచులు మాజీ సింగిల్ డైరెక్టర్లు, పార్టీశ్రేణులు తదితరులు పాల్గొన్నారు.