మీ సేవా కేంద్రాల నిర్వాహకుల జీవితాలు ప్రశ్నార్ధకం..!

by Sumithra |
మీ సేవా కేంద్రాల నిర్వాహకుల జీవితాలు ప్రశ్నార్ధకం..!
X

దిశ, అలంపూర్ : తెలంగాణలో త్వరలోనే ఊరికి ఒక మీ సేవా కేంద్రాలను ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జులై 1 నుంచి ప్రభుత్వం సెంటర్లు నిర్వహించేందుకు ఆపరేటర్లను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో ఈ పెనుమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఆయా మండల కేంద్రాల్లో, ఆయా గ్రామాల్లో నిర్వహించే మీ సేవా కేంద్రాలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం ప్రకటించనుంది. దీంతో గత 12 ఏండ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న మీసేవకుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. చాలిచాలని కమిషన్లతో నేటి వరకు తమ జీవితాలను పెట్టి చాకిరితో సేవలు నిర్వహించినప్పటికీని ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. కమిషన్లు పెంచి మీసేవ కేంద్రాలను ఆదుకోవాలని ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చిన ఏ ప్రభుత్వం స్పందించలేదు. కనీసం సెంటర్ల నిర్వహణ పగడ్బందీగా నిర్వహించే విధంగా జీవో జారీ చేస్తారని, కమిషన్లు పెంచి మీసేవ నిర్వాహకులను ఆదుకుంటారని భావించిన యజమానుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామంలో మాత్రం మీసేవ సెంటర్లు వస్తున్నాయని మహిళా సంఘాల సభ్యులు, యువకులు ఉత్తేజంతో సెంటర్ పెట్టుకోవడానికి పైరవీలు చేస్తున్నారు.

ఇప్పటివరకు.. వివిధ కుల, ఆదాయ ధృవపత్రాలు, వివిధ రకాల బిల్లు చెల్లింపులు మీసేవా ద్వారా ప్రజలు పొందేవారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో ఒక సెంటర్ నిర్వహించి సేవలో అందించాలని .. ప్రజలకు సేవలు చేరువలో రానున్నడంతో.. ప్రజలు దీని పై మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా.. ఓటర్ కార్డ్స్, రేషన్‌ కార్డ్స్, రేషన్ పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలూ మీ సేవ కేంద్రాలకు ఇవ్వాలని ఎన్నోసార్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. ఇప్పటివరకు.. ఆయా సేవలకు కేంద్రంగా వున్న మీసేవా సెంటర్లు మూతపడక తప్పదు అనే అనిపిస్తుంది. ఏది ఏమైనా కొత్త మీసేవ సెంటర్లు ఇవ్వడంతో ఉన్న సెంటర్లు తొలగిపోయి గత 12 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న మీసేవ నిర్వాహకుల బ్రతుకులు ఆగం అవుతాయని, ప్రభుత్వం స్పందించి కొత్త సెంటర్లు ఇచ్చే నిర్ణయం వెనక్కి తీసుకొని తగిన న్యాయం చేయాలని ఆయా మీసేవ సెంటర్ల యజమానులు విన్నవించుకుంటున్నారు.

Next Story

Most Viewed