వర్గీకరణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే.. నాయకుల ఆరోపణ

by Disha Web Desk 23 |
వర్గీకరణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే.. నాయకుల ఆరోపణ
X

దిశ, అయిజ : మాదిగల వర్గీకరణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని కేంద్రమంత్రి మురుగన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, నాగర్ కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ అన్నారు. వికసిత భారత్ ప్రధాని మోదీతోనే సాధ్యమని వారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అయిజ లో మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజా ఆశీర్వాద సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.30 సంవత్సరాలుగా మాదిగ జాతి ప్రయోజనాల కోసం వర్గీకరణ అంశం పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సహకరించలేదని మందకృష్ణ దుయ్యబట్టారు. గతంలో రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వానికి మాదిగల వర్గీకరణ కోసం ఉత్తరం రాయమని కోరిన స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ మాదిగలకు మాత్రం చేసింది శూన్యమని విమర్శించారు.

జాతి ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలిసినప్పుడు తక్షణం స్పందించి వర్గీకరణ కోసం కమిటీని వేయడం చూస్తే మాదిగల న్యాయమైన హక్కు కాపాడటంలో ఉన్న శ్రద్ధ కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఇదే కాకుండా 500 ఏళ్ల కళ రామమందిర్ నిర్మించి చరిత్ర సృష్టించారని ఆయన తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటును కూడా మాదిగలకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అదే బిజెపి ప్రభుత్వం ఉన్న మూడు రిజర్వ్ ఎంపీ స్థానాలను మాదిగలకు కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు. దేశ స్థాయిలో ఏదైనా ఒక అంశం గురించి తక్షణ నిర్ణయం తీసుకోవాలంటే అది మోదీ తోనే సాధ్యమని,అందువల్లనే మాదిగలు కూడా మోడీ వెంటే నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు రంజిత్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed