Special Buses : ఉపాధ్యాయులు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన కలెక్టర్..

by Sumithra |
Special Buses : ఉపాధ్యాయులు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన కలెక్టర్..
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు వెళ్లేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు.

శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖాముఖి కార్యక్రమానికి గద్వాల జిల్లా నుండి విద్యాశాఖ పరిధిలో మొత్తం 360 మంది ఉపాధ్యాయులు అందరూ జిల్లా ఐడీఓసీ కార్యాలయం నుంచి తొమ్మిది ప్రత్యేక బస్సులలో హైదరాబాద్ కి వెళ్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇందిర, ఈడీఎస్సీ రమేష్ బాబు, జిల్లా క్రీడా అధికారి బీఎస్.ఆనంద్, ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story