- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదమరిస్తే అంతే సంగతులు..!

మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. అటువైపు వెళుతున్న వాహనాలు పట్టు తప్పితే అంతే మరి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం చూసి చూడనట్టు వివరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్డుపై ఉన్న కల్వర్టు దెబ్బతిని లోతైన గుంత బడి గత 20 రోజులు అవుతున్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు.
ఈ రోడ్డు గుండా మండల శాఖకు సంబంధించిన అధికారులతో పాటు జిల్లా అధికారుల సైతం ఇదే రహదారిపై వడ్డేపల్లి రాజోలి ఉండవల్లి మండలాలకు సంబంధించిన గ్రామాలకు వెళుతుంటారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పాలకులైన స్పందించి వెనువెంటనే మరమ్మత్తులు చేయాలని మానవపాడు గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు కూడా కోరుతున్నారు.