- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్..

దిశ, కొత్తకోట: కొత్తకోట మండలం కానయపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కేంద్రాన్ని మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుందని కంటి అద్దాలు ప్రజలకు ఉచితంగా ఇస్తుందని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం గ్రామంలోని శంకర్ సముద్రం రిజర్వాయర్ లను పరిశీలించి ముంపు గ్రామాల నిర్వాసితులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో మీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, గ్రామ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శీను, ఎమ్మార్వో బాల్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, గాడిల ప్రశాంత్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.