Kollapur: సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

by srinivas |
Kollapur: సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ,కొల్లాపూర్: ఈ నెల 19న ఆదివారం కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరిగింది. అయితే కుడికిల్ల గ్రామానికి చెందిన కొండ్ర చంద్రయ్య సీఎం సభలో పాల్గొన్నారు. సీఎం సభ అయిపోయిన తర్వాత చంద్రయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో చంద్రయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం సభ అయిపోయిన తర్వాత ఇంటికి బయల్దేరిన చంద్రయ్యను కొందరు దుండగులు అడ్డుకుని ఉంటారని, ఆయన వద్ద ఉన్న డబ్బు కోసం కొట్టి చంపి ఉంటారని ఆరోపించారు. చంద్రయ్య వద్ద రూ. 2 లక్షలు ఉండాలని.. ఆ డబ్బులను కండువాలో పెట్టి ఆయన నడుముకు కట్టుకుని అవసరమైనప్పుడు వాడుకునే వారని తెలిపారు. చంద్రయ్య వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గమనించిన దుండగులే ఆయనను కొట్టి చంపి పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed