- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మెడికో ప్రీతి ఘటనపై ర్యాలీ..
దిశ, అచ్చంపేట: గిరిజన మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర యువసేన అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి నిరసనగా అచ్చంపేట పట్టణంలో విద్యార్థుల చేత ఆత్మహత్యలు ఆపాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ.. సైఫ్ అనే దుర్మార్గుడు చేసిన పనికి ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమన్నారు. తప్పు చేయాలని అనుకునే వారికి భయం పుట్టాలని.. ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని సింకారు శివాజీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భద్రత గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాలని కోరారు. ఇలాంటి ఘటన మరెక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.
చిన్న విషయాలకు కూడా ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏమి అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'తెగించి కొట్లాడుదాం' అనే సంకల్పం విద్యార్తులల్లో ఎందుకు ఏర్పడటం లేదని ప్రశ్నించారు. సమస్య చిన్నదైన పెద్దదైన పరిష్కారం ఉంటుందని తెలిపారు. మనకు జరిగిన అన్యాయానికి న్యాయం పొందే దారులు ఎన్నో ఉన్నాయని అన్నారు. నిందితుడు సైఫ్‌ని కఠినంగా శిక్షీంచాలనీ డిమాండ్ చేశారు.
కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.. రాష్ట్ర యువసేన అధ్యక్షుడు సింకారు శివాజీ
ప్రీతి కుటుంబానికి రూ.1 కోటి ప్రకటించాలని.. ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సింకారు శివాజీ డిమాండ్ చేశారు. లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు మారుతి, యువ సేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విష్ణు, విద్యార్థి సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, చైతన్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.