ఇంకా ముప్పై ఏళ్లు అధికారం నాదే..! నీవు ఏడికిపోయినా నిన్నొదలా..!! (Video)

by S Gopi |   ( Updated:2023-12-13 15:56:52.0  )
ఇంకా ముప్పై ఏళ్లు అధికారం నాదే..! నీవు ఏడికిపోయినా నిన్నొదలా..!! (Video)
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఇంకా ముప్పై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉంటా.. వచ్చేసారి మంత్రిని కూడా అవుతున్నా... నీవు 33 జిల్లాల్లో ఏడబోయినా నిన్ను మాత్రం వదలను.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కూడా తిట్టగలుగుతా.. నీవెంతా? అంటూ ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ జిల్లా అధికారిపై పూనకంతో ఊగిపోయారు. ఒక్కో పంచ్ డైలాగ్ తో తన అక్కసునంతా వెళ్లగక్కారు.ఇప్పటికే రాష్ట్రంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న గువ్వల బాలరాజు మరోసారి తన నోటి దురుసుతో వార్తల్లోకి ఎక్కారు. శనివారం నల్లమల చెంచుపెంటల్లో భ్రమరాంబిక మల్లికార్జున కళ్యాణం కార్యక్రమ వేదికగా జిల్లా అధికారుల ముందే సంబంధిత శాఖ జిల్లా అధికారిని తిట్టిపోశారు. ఆ సందర్భాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను సైతం 'ఏ బాబు బంద్ చేయవయా' అంటూ చెప్పడమే తడుగా వెంటనే తన గన్మెన్లు అంతా మీడియా ప్రతినిధిని దూరంగా లాక్కెళ్లారు. ఇదంతా చూస్తున్నా వారంతా ప్రేక్షకులుగా మిగిలిపోయారు తప్ప ఏమీ చేయలేని నిస్సాహాయకులుగా ఉండిపోవడం విశేషం.

Advertisement

Next Story