జోగులాంబ గద్వాల జిల్లాను కమ్మేసిన మంచు

by Mahesh |
జోగులాంబ గద్వాల జిల్లాను కమ్మేసిన మంచు
X

దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు రోజులుగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉదయం 9 గంటలు అయినా మంచుతో సూర్యుడు కనిపించడం లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రాత్రివేళ కూడా పడిపోతున్నాయి. 9 గంటలైనా చలి వీడకపోవడంతో ఎక్కడ చూసిన రోడ్లపై చలిమంటలతోనే గడేపిస్తున్నారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలను మంచు దుప్పటి కమ్ముకోవడంతో కశ్మీర్, ఊటీలను తలపిస్తున్నాయి. జాతీయ రహదారిపై మంచుతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వయోవృద్ధులు, చంటి పిల్లలను అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్లనీయవద్దని చెబుతున్నారు. ఒకవైపు మంచు మరోవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎక్కడ చూసినా చలిమంటలు వేసుకొని కాలం వెల్లదీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed