- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి పాలమూరు జిల్లాపై సిట్ స్పెషల్ ఫోకస్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సిట్ అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు ముందుగానే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలలో మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన వారు ఏకంగా ఆరుగురు అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాలలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ సిబ్బందితో వనపర్తి జిల్లా కేంద్రం గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ టీఎస్పీఎస్సీ సిబ్బందితో ఉన్న పరిచయాల కారణంగానే పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలను తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మార్చుకోవడం ద్వారా లక్షలాదిమంది నిరుద్యోగుల బతుకులను ఆగం చేసేలా వ్యవహరించారు. రేణుక సొంతం సోదరుడు గండీడ్ మండలం మన్సూర్ పల్లి తండాకు చెందిన రాజేశ్వర్, ఆమె తండ్రి సోదరిని కుమారులు అయిన నీలేష్, గోపాల్ నాయక్, మరో సమీప బంధువు పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలో ఆయా పరీక్ష ఇలా నిర్వహణ..
ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలను సేకరిస్తున్నారు.. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నలుగురు బృందంతో కూడిన సిట్ అధికారులు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు. నవాబ్ పేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 7:30 గంటల నుండి మొదలుకొని అర్ధరాత్రి దాటే వరకు ప్రశాంత్ రెడ్డిని విచారణ జరిపారు. ప్రశాంత్ రెడ్డి ఏఈగ పరీక్షలు రాయడం.. అత్యధికంగా వంద మార్కులకు పైగా సాధించడంతో అధికారులు ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించారు. అర్ధరాత్రి దాటేవరకు విచారణ కొనసాగింది.
సిట్ అధికారులు ప్రశాంత్ రెడ్డిని నవాపేట పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ప్రశ్నలు వేసి వివరాలను సేకరించారు. ఇప్పటికే ఏడుగురు జైలులో ఉండగా.. విచారణ సమయాలలో అరెస్ట్ అయిన వారి నుండి పోలీసులు అన్ని వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోని ప్రశాంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రేణుక, ఆమె భర్త డాక్య నాయక్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురితో అనుబంధాలు ఉన్న కారణంగా ప్రశ్నాపత్రాలు ఎంతమందికి చేరి ఉంటాయో అన్న విషయం తేల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పేపర్ లీకేజీ వ్యవహారాలలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న వారు ఇచ్చిన సమాచారంతోనే అధికారులు ప్రశాంత్ రెడ్డినీ అదుపులోకి తీసుకొని విచారణలు చేస్తున్నారు.
మరింత మంది ఉండే అవకాశం:
పేపర్ లీకేజీ వ్యవహారాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరికొంతమంది ఉండే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలలో చేరితే చాలు తమ బతుకులు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పోలీస్ అధికారులకు చిక్కిపోయారు గట్టిగా విచారణ చేస్తే మరి కొంతమంది వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.