roads : కల్వకోలులో పడకేసిన పారిశుధ్యం..

by Sumithra |
roads : కల్వకోలులో పడకేసిన పారిశుధ్యం..
X

దిశ, కొల్లాపూర్ (పెద్ద కొత్తపల్లి) : పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో రహదారులు మురికి కూపంగా మారాయి. దీంతో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. మండలాలకు గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ గాలికి వదిలేశారు. అసలే వానా కాలం. ఆపై ఈగలు, దోమలు, స్వైర విహారం చేస్తుండగా, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామంలో ప్రధాన పెద్ద కాలువలో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. అలాగే గ్రామంలో చాలా వార్డుల్లో ఫ్రై డ్రైన్లు లేకపోవడం చేత వర్షపు నీరంతా అంతర్గత రహదారుల పై నిలిచిపోతుంది. దీంతో కల్వకోలు గ్రామంలో ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు.

గ్రామంలో ఏ రోడ్డు కెళ్ళి చూసినా డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపైనే మురుగు పారుతుంది. శనివారం సీపీఎం నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ పారిశుధ్యం లోపించిన విషయాన్ని ఎత్తిచూపారు. విషజ్వరాలు వస్తున్న మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీలకు నిధులు లేక అభివృద్ధి పనులు కుంటుపడుతూన్నాయని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య సతీష్ గ్రామ ప్రజలు కేశవులు సామి పుల్లయ్య పూజారి రాముడు శివ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed